ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. యూపీలోని లక్నోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించారు. ఓ వ్యక్తి నడుస్తూ ఆమె వెనుకాలే వచ్చి మెడలోని గొలుసును లాక్కొని పరిగెత్తుకుంటూ వెళ్లి బైక్ ఎక్కగా, ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa