ఏపీలో కొత్త మద్యం పాలసీపై తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 18న జరిగే మంత్రివర్గ భేటీలో నూతన లిక్కర్ విధానానికి ఆమోదం తెలపనుంది. మంత్రి వర్గ ఉపసంఘం తమ సిఫార్సులను కేబినెట్ కు సమర్పించనుంది.
మద్యం దుకాణాలు..బార్లను గతంలో లాగానే ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.