కొత్తూరు మండలంలోని బిట్-3 ఇరపాడు గ్రామంలో ఆదివారం ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కరణం దాసు(70) దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంతకీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాసుకి భార్యతో పాటు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎంఏ అహ్మద్ తెలిపారు.