కేరళలోని కాసరగోడ్ జిల్లాలో మగోర్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రజలు వారి కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండానే మరణిస్తే.. వారికి బొమ్మల రూపంలో ఘనంగా వివాహం జరిపిస్తారు.
ఈ వివాహాన్ని సాధారణ పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోకుండా, బంధువుల సమక్షంలో వేడుకలా జరుపుతారు. ఈ బొమ్మల పెళ్లి తర్వాత, (చనిపోయిన) వధూవరుల కుటుంబాలు బంధువులుగానే కొనసాగటం మరో విశేషం. ఇలా పెళ్లి చేస్తే మృతి చెందిన తమ బంధువుల ఆత్మలు స్వర్గంలో సుఖంగా ఉంటాయన్నది వారి నమ్మకం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa