ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 02:48 PM

ఉక్రెయిన్ దేశంతో యుద్ధం.. యూరప్ దేశాలతో వైరుధ్యం.. అమెరికాతో విభేదం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రష్యా దేశం నెట్టుకొస్తోంది. వీటన్నింటి కంటే ఆ దేశం జనాభా లేమి సమస్యను ఎదుర్కొంటోంది.నానాటికి జననాల రేటు పడిపోతుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు స్పందించక తప్పలేదు. జననాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ఆయన ఆందోళనకు గురయ్యారు. దేశ ప్రజలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ” మన ఫ్యూచర్ పాపులేషన్ పైనే డిపెండ్ అయి ఉంది. ఉద్యోగాల వల్ల చాలామంది తీరికలేకుండా గడుపుతున్నారు. అలాంటివాళ్లు పిల్లలను కనడం నిలిపివేయొద్దు. పనిలో బిజీగా ఉన్నప్పటికీ.. భోజన సమయంలో, సాయంత్రం కాఫీ తాగే వేళలో శృంగారంలో పాల్గొనండి. పిల్లలను కనండి. పిల్లలు పుట్టడం వల్ల జనాభా పెరుగుతుంది. దానివల్ల దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని” పుతిన్ వ్యాఖ్యానించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటున్నది


గత కొంతకాలంగా రష్యా దేశంలో జననాల సంఖ్య తగ్గుతోంది. యువత ఉద్యోగాల వల్ల తీరిక లేకుండా ఉంటున్నారు. కొంతమంది పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదు. చదువు, కెరియర్ వల్ల చాలామంది బ్రహ్మచారులు గానే మిగులుతున్నారు. ఇక ఆడవాళ్లు కూడా అదేవిధంగా కొనసాగిస్తున్నారు. దీనివల్ల రష్యాలో జననాల రేటు 1.5కి పడిపోయింది. జనాభా సుస్థిరంగా ఉండాలి అంటే కచ్చితంగా జననాల రేటు 2.5 ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పుతిన్ వ్యాఖ్యలను రష్యా ఆరోగ్య శాఖ మంత్రి సమర్థించినట్టు తెలుస్తోంది..” పనిలో తీరిక లేకుండా ఉంటున్న వారు పిల్లలను కనడం లేదు. వారికి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా శృంగారంలో పాల్గొనాలి. సంతాన భాగ్యాన్ని పొందాలి. లేకుంటే జీవితం నిస్సారంగా మారిపోతుంది. జీవితకాలం చూస్తుండగానే కొవ్వొత్తి కలిగినట్టు కరిగిపోతుందని” వ్యాఖ్యానించారు.


రష్యా దేశంలో జననాల రేటు పెంచేందుకు అక్కడ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది. 18 నుంచి 40 సంవత్సరాల మహిళలను తమ గెస్టేసియన్ కెపాసిటీని (గర్భం దాల్చే సామర్థ్యం) అంచనా వేసుకోవాలని సూచిస్తోంది. వైద్య పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించుకోవాలని వివరిస్తోంది. ఉద్యోగులు పిల్లల్ని కనే విధంగా ప్రోత్సహించాలని కంపెనీలను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. దీనికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందిస్తామని రష్యా పార్లమెంటు సభ్యుడు ఒకరు తెలిపారు. జననాల రేటు పెంచడానికి అక్కడి గవర్నర్లకు బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది..


ఇక దేశంలో యువత 19 నుంచి 20 ఏళ్ల మధ్యలోనే పిల్లల్ని కనాలని రాజకీయ నాయకులు పిలుపునిస్తున్నారు. అప్పుడు ఒక్క కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారని.. దేశం ఆ విధంగా ముందుకు పోతుందని పేర్కొంటున్నారు. ఆడవాళ్లు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపించాలని కోరుతున్నారు. 24 సంవత్సరాల లోపు ఉన్నవారు పిల్లలను కంటే భారీగా నగదు ప్రోత్సాహం అందిస్తామని.. గర్భ స్రావాలు, గర్భ విచ్చిత్తులపై కఠిన పాదం మోపుతామని రష్యా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జంటలు విడాకులు తీసుకోకుండా డైవర్స్ ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచుతోంది..


పిల్లల్ని కనాలని ప్రజల్ని పదేపదే కోరుతున్న పుతిన్ మాత్రం.. తన సంతానం విషయంలో ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆయన కుటుంబం గురించి కూడా బహిరంగంగా ఒక్క విషయం కూడా చెప్పలేదు. గ్లోబల్ మీడియా కథనాల ప్రకారం పుతిన్ కు 39 సంవత్సరాల వయసు ఉన్న మారియా, 37 సంవత్సరాల వయసు ఉన్న కాటరీనా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారని తెలుస్తోంది. వీరిద్దరు మాత్రమే కాకుండా ఏడు, ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కూడా ఉన్నట్టు గ్లోబల్ మీడియా తన కథనాలలో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com