పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టడంతో కూలీలు భయంతో పరుగులు పెట్టారు. రణస్థలం మండలం లంకపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మృతులను కిల్లారి కాంతమ్మ, కిల్లరి సూరి కిష్టప్పడుగా గుర్తించారు. మరో ముగ్గురు కూలీలు గాయపడగా గ్రామస్థులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa