తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. ఈ మేరకు టికెట్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,406 మంది స్వామివారిని దర్శించుకోగా 31,151 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa