అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు.. కి ఏకంగా 13 మంత్రిత్వ శాఖలు అప్పగించారు. అంటే.. ఆమెపై ఆయన ఎంతలా నమ్మకం ఉంచారో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడామె సీఎం. అయినప్పటికీ ఆమె ఆ శాఖలన్నీ తన దగ్గరే ఉంచుకుంటున్నారు. ఓవైపు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు ఆ శాఖల సంగతీ చూస్తానని ఆమె తెలిపారు. అవేమీ సాదాసీదా శాఖలు కావు. వాటిలో ఆర్థిక శాఖ, ప్లానింగ్, విద్యుత్, నీటి సరఫరా, రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్.. ఇలా చాలా ఉన్నాయి. మరో నేత సౌరబ్ భరద్వాజ్.. 8 శాఖల్ని తన దగ్గర ఉంచుకోగా.. కొత్త మంత్రి ముఖేష్ కుమార్ అహ్లావత్‌కి 5 మంత్రిత్వ శాఖలు అప్పగించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక.. చాలా మంది మహిళలు సీఎంలు అయ్యారు. వారిలో అతిషి 17వ మహిళగా గుర్తింపు పొందారు. అలాగే.. ఆమె ఢిల్లీకి 8వ సీఎంగా శనివారం ప్రమాణం చేశారు. మరో ప్రత్యేకత కూడా పొందారు. ఢిల్లీకి సీఎంలు అయిన మహిళల్లో.. షీలా దీక్షిత్, సుష్మ స్వరాజ్ కంటే.. 43 ఏళ్ల అతిషీయే చిన్నవారు.
మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన ఆమె.. చాలా త్వరగానే సీఎం అయ్యారు. కానీ.. ఆమె ఈ పదవిలో మరో 5 నెలలే ఉంటారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఆప్ గెలిస్తే, మళ్లీ కేజ్రీవాల్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల అతిషికి 5 నెలలే ఛాన్స్ ఉంది. ఇంత తక్కువ టైమ్‌లోనే ఆమె సీఎంగా తన మార్క్ చూపించాల్సి ఉంటుంది. అదే సమయంలో తన మంత్రిత్వ శాఖలనూ చూసుకోవాల్సి ఉంటుంది. మరో సవాలు కూడా ఉంది. మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తేవాల్సిన బాధ్యత కూడా ఆమె పైనే ఉంది. ఇలా అంతా తానై నడిపిస్తున్నారు అతిషి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా.. గత 5 నెలలుగా కేజ్రీవాల్, తీహార్ జైల్లో ఉండటం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన చాలా పాలసీల అమలు ఆగిపోయింది. బెయిల్‌పై వచ్చాక కూడా కేజ్రీవాల్ సంతకాలు పెట్టే ఛాన్స్ లేకుండా పోయింది. అందువల్ల ఇప్పుడు సీఎం అయిన అతిషీ.. ఈ పాలసీలపై ఫోకస్ పెట్టి.. వీటన్నింటినీ అమలు చెయ్యాల్సి ఉంటుంది. ముఖ్యంగా డోర్ స్టెప్ డెలివరీ సర్వీసులను మళ్లీ ప్రారంభించి.. ప్రజల మన్ననలు పొందాల్సి ఉంటుంది. ఐతే, అతిషీ చాలా తక్కువ కాలంలోనే తానేంటో నిరూపించుకున్నారు. మళ్లీ కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అందుకే ఆమెను పార్టీ ఏకగ్రీవంగా శాసనసభా పక్ష నేతగా ఎంచుకుంది. అందుకే ఇక అతిషీ మార్క్ పాలన మొదలైనట్లే.