మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నామన్నారు. సమస్యలను విని సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.