అనంతపురంలోని సాయినగర్ లో సోమవారం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ వందరోజుల పాలనపై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో కనీసం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 16వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేశామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.