కార్మిక వర్గాన్ని బానిసలను చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. సీపీఐ జిల్లా కార్యదర్శి పి. ఎల్ నర్సింహులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. సోమవారం రైల్వే కోడూరు గాంధీ బొమ్మ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సాంబశివ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా కార్మిక సంఘాల నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఉద్యమాలు నిర్వహిస్తున్నా.. లేబర్ కోడ్ లను అమలు జరపాలని చూస్తున్నారని అన్నారు.