టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వంద రోజుల పాలన చూసి ప్రజలు హర్షిస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం 12వ డివిజను చిన్నచౌకు మణిభూషణ్‌రెడ్డి కార్యాలయం నుంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తోందన్నారు. టీడీపీ నాయకులు గంగిరెడ్డి, జయరాం, జయచంద్రనాయుడు, రాజేశ్వరనాయుడు, సురేశ, నాగలింగమయ్య, వెంకటరాజు పాల్గొన్నారు.