రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శృంగవరపుకోట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొట్టాం గ్రామం వద్ద శనివారం ఉదయం రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కొట్టం నుంచి ధర్మవరం వైపు వస్తున్న ఆదిరెడ్డి సురేష్(33) తీవ్రంగా గాయపడ డంతో చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ సోమవారం మరణించాడు. మృతుడి స్వగ్రామం సన్యాసయ్యపాలెం కాగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమా దంలో మృతిచెందడంతో వారంతా రోడ్డున పడ్డారని స్థానికులు విచారం వ్యక్తం చే శారు. ఎస్ఐ భాస్కరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.