తిరుమల లడ్డు వివాదం ఏపీని కుదిపేస్తుంది. తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు.మన దేశం నుంచి మాత్రమేకాకుండా.. విదేశాల నుంచి కూడా వచ్చి స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇంతటి పవిత్రమైన తిరుమల స్వామి ఆలయంలో లడ్డులో.. జంతువుల కొవ్వు, చేప నూనెను ఉపయోగించారని బైటపడిన ఘటన పెను సంచలనంగా మారింది.దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సిట్ ను ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం 11 రోజుల పాటు ప్రాయిశ్చిత దీక్ష కూడా ప్రారంభించారు. మరోవైపు ఇటీవల తిరుమలలో శాంతి యాగం కూడా నిర్వహించారు. అంతే కాకుండా.. ఏపీ వ్యాప్తంగా దేవాలయాలలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించాలని కూడా చంద్రబాబు కోరారు. దీంతో అన్ని దేవాలయాలలో కూడా శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈ రోజు విజయవాడ చేరుకున్నారు. అక్కడ పూజారులతో కలిసి కనకదుర్గమ్మ దేవాలయం సన్నిధిలో శుద్ది కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొన్ని రోజుల్లో దసరా శరన్నావరాత్రుల నేపథ్యంలో.. ఇప్పటికే విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పండితులతో కలిసి ప్రతిమెట్టును పసును కలిపిన నీళ్లతో శుద్ది చేశారు. అంతేకాకుండా.. మెట్లకు పసుపు, కుంకుమ బొట్లను సైతం పెట్టారు.
ఇదిలా ఉండగా.. ఈ కార్యక్రమంలో...ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), బాలశౌరీ, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెట్ల మార్గాన తిరుమలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి బహిరంగ సభను నిర్వహించనున్నారు.ఈ క్రమంలో.. పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకొని శుధ్దికార్యక్రమంలో పాల్గొనడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.