ఏపీలో ఉచిత ఇసుక స్కీమ్‌లో భాగంగా ఇసుకను డోర్ డెలివరీ చేసే అంశంపై క్లారిపై వచ్చింది. డోర్ డెలివరీ చేసే లారీలు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా అఫిడవిట్ రూపంలో ఒప్పందం చేసుకోవాల్సిన పని లేకుండా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నేటి నుంచి ఇంటి వద్దే ఇసుకను అందించనున్నారు. గనుల శాఖ డైరెక్టర్లతో టిప్పర్ల యజమానులు జరిపిన చర్యల్లో ఈ అంశంపై నిర్ణయించారు.ఉచిత ఇసుక పంపిణీలో రవాణా చార్జీలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా చార్జీలు ఒకే విధంగా ఉండేలా ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక సరఫరా చేసే స్టాక్ పాయింట్ల నుంచి డెలివరీ చేసేవరకు ఉండే దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని ధ రలను నిర్ణయించారు. ట్రాక్టర్‌కు 4.5 టన్నులు, ఆరు టైర్ల లారీకి 10 టన్నులు, 10 నుంచి 14 టైర్ల లారీకి 18 నుంచి 35 టన్నుల వరకు కిలో మీటరుకు ఏ మేరకు ధర వసూలు చేయాలో ప్రభుత్వం ఈ జీఓలో నిర్దేశించింది. స్టాక్ పాయింట్ నుంచి పది కిలో మీటర్ల లోపుగా 4.5 టన్నుల ట్రాక్టర్‌కు కిలో మీటరుకు రూ.13.5 చొప్పున ధర వసూలు చేయాలని డిసైడ్ చేసారు.