తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆమె అన్నారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ దారుణ ఘటనపై ప్రజలకు నిజానిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాశానని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచాణ జరపాలని సీజేఐని కోరామని చెప్పారు. తిరుమల డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందని... ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందేనని అన్నారు.