ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసమే శ్రీవారి లడ్డు డ్రామాకు తెరదీశారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలో వైసీపీ శ్రేణులు శనివారంరుషికొండలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారని, ప్రజల దృష్టిని మరల్చడం కోసం లడ్డూని తెరపైకి తెచ్చారని విమర్శించారు.