సింగనమల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.