ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
సోమవారం ధర్మవరంలో సంఘం నాయకులు నిరంజన్, పోతలయ్య, బాలాజీ, నాగార్జున మాట్లాడుతూ. ప్రైవేటు పాఠశాలల్లో అర్హత లేని టీచర్లను తీసుకొని, కేవలం ధనార్జన ద్యేయంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీజ్ చేయాలన్నారు.