ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారం ఏపీ హై కోర్టుకు చేరింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ముగ్గురి సస్పెన్షన్ ఫైల్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. వీరిపై అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాదంబరి జత్వానీకి సంబంధించిన కీలక పిటిషన్ల విచారణ ఇవాళ( మంగళవారం) జరగనుంది.
బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును పలువురు ఐపీఎస్‌లు,పోలీస్ అధికారులు ఆశ్రయించారు. నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. . నేడు మరోసారి న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. . ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు పిటిషన్ వేశారు.