మాజీ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్ కన్నుమూశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆమె తన సర్వీసంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడిపారు. రాజమండ్రి, శ్రీకాకుళం జిల్లాల్లో సబ్ కలెక్టర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, కడప కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాథమిక విద్య, సర్వశిక్ష అభియాన్‌లో అనేక సంస్కరణలు అమలు చేశారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఆమె అనేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశారు.