వైసీపీ హయాంలో లులూ గ్రూప్ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనని వెళ్లిపోయింది. ఆ గ్రూప్ మళ్లీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం మంచి పాలనకు ప్రతీక’ అని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘విశాఖ, విజయవాడ, తిరుపతిలో సుమారుగా రూ.172 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన అనేక సంస్థలు ఇదే మాదిరిగా వస్తున్నాయి. గత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి జే ట్యాక్స్ వసూళ్లే పనిగా పనిచేస్తే చంద్రబాబు యువతకు ఉద్యోగాల గురించి మాత్రమే పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా ఏడున్నర లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా కొత్త ఇంధన పాలసీని తయారు చేశారు’ అని నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే రాష్ట్రంలో ఆలయాల్లో పరిస్థితిని మెరుగుపర్చి భక్తుల ప్రశంసలు పొందుతోందని గూడపాటి శ్రీనివాసరావు చెప్పారు.