పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్నెంట్ డాక్టర్ కరీముల్లా అన్నారు. మంగళవారం నెహ్రూ యువ కేంద్రం, అమ్మ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో "స్వచ్ఛతా హీ సేవ" కార్యక్రమం నిర్వహించారు.
మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సిసి, స్కౌట్ విద్యార్థులతో పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి రాయల కూడలి వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.