ప్రజా కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. తహసీల్థార్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, మరి కొందరు అధికారులు మాత్రమే హాజరు కావడంతో సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్‌చేసి కార్యక్రమానికి రాకపోతే సహించేది లేదన్నారు. ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో అధికారులు ముందుండాలన్నారు. పలువురి నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్క రించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
యిప్పిలి వెంకటేశ్వరావు, సంపంగి వేణుగోపాల తిలక్, పెనుబోయిన మహేశ్ యాదవ్, షేక్ జహీర్ అహ్మద్, దాసే శ్రీను, తదితరులు పాల్గొన్నారు అనంతరం కొవ్వలి గాంధీ నగర్‌లోని బీసీ బాలుర వసతి గృహన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీంచారు. మరుగుదొడ్లు, వంటశాల పరిసరాలను పరిశీలించారు. వసతి గృహం అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరగతుందన్నారు. వార్డెన్ సత్యనా రాయణను పిల్లలకు మరింత శుభ్రతతో రుచిగా భోజనం అందించి మంచి పేరు తెచ్చుకోవాలని చింతమనేని ఆదేశించారు. వారి వెంట టీడీపీ నాయ కులు వెలమాటి అనిల్, కసూకూర్తి రామకృష్ణ తదితరులు ఉన్నారు.