పశ్చిమాసియాలో ఉద్రికత్తలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించి మరింత ఆజ్యం పోసిన ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఐదేళ్ల తర్వత తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై మిసైల్ దాడులను సమర్థించుకున్న ఆయన... ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ప్రకటించారు. శత్రువుల పప్పులు ఉడకనివ్వబోమని ప్రతినబూనారు. నస్రల్లా మరణం తనను తీవ్రంగా బాధించిందన్నారు. హమాస్, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విజయం సాధించలేదని తేల్చి చెప్పారు. నస్రల్లా మనమధ్య లేనప్పటికీ ఆయన మార్గం మాత్రం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. శత్రువులకు వ్యతిరేకంగా మనమందరం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.