పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల కోసం తాను గ్రీన్ బుక్ రాస్తానని వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పదవీ స్వీకార సభ జరిగింది. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు అధ్యక్షత వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.