శుక్రవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పదవీ స్వీకార సభ జరిగింది. ఈ సందర్భంగా .... ఓడిన వారం రోజుల్లోనే ప్రజా సమస్యలపై రోడ్డెక్కిన ఘనత వైయస్ఆర్సీపీ కార్యకర్తలకే చెందుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.
వారికి ఎటువంటి కష్టం వచ్చినా తోడుగా నడిచేందుకు పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలకు సముచిత స్థానం కల్పించి పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకున్న నిర్ణయం సంతోషకరం అన్నారు.