దేవుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దని.. పొలిటికల్ డ్రామాలు చేయెద్దంటూ చంద్రబాబుకు సుప్రీం కోర్టు మొట్టికాయులు వేసిందని మాజీ సీఎం జగన్ అన్నారు. అయన మాట్లాడుతూ.... తిరుమల లడ్డూ ప్రసాదం అంశంలో చంద్రబాబు స్వయంగా వేసుకున్న ‘సిట్’ను కూడా రద్దు చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు.. వారికి సహకారం అందించడానికి రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఒక అధికారి సభ్యులుగా స్వతంత్ర దర్యాప్తు బృందం(సిట్)ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. చంద్రబాబుపై సుప్రీం కోర్ట్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా, టీడీపీ లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేస్తూనే ఉంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలను దేశం మొత్తం గమనించాలని తన ఎక్స్ ఖాతలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు చంద్రబాబు తీరును ఎండగడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ట్వీట్ చేశారు.