మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, క్వింటాలుకు 3300 గిట్టుబాటు ధర కల్పించాలని, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులో ఉన్న ఇండోర్ స్టేడియం ఆవరణంలో శనివారం సిపిఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు, వెంకటేశ్వర్లు మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా పట్టణ నాయకులు రైతులు పాల్గొన్నారు.