తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను రాజకీయ దుర్భిద్దితో కావాలని అబద్దాలు చెప్పి, జంతువుల కొవ్వు వాడి లడ్డూలు తయారు చేసి భక్తులకు ఇస్తే, వారవి తిన్నట్లు సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అయన మాట్లాడుతూ.... ఆయన తిరుమల లడ్డూను, శ్రీవెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను అపవిత్రం చేశారు. వీటన్నింటికీ సంబంధించి నేను సాక్ష్యాధారాలతో సహా చూపించాను.
దీనిపై కోర్టు కూడా మొట్టికాయ వేసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బ తీస్తూ, చంద్రబాబు ఎలా అబద్ధాలు చెప్పాడనేది చూస్తే.. చంద్రబాబు సీఎం అయ్యాక, తను నియమించుకున్న ఐఏఎస్ అధికారి, టీటీడీ ఈఓ చంద్రబాబు ప్రకటనలకు విరుద్ధంగా స్వయంగా ప్రకటనలు చేశాడు.చంద్రబాబు మామూలుగా మంచి వ్యక్తి అయితే, ఇంత ఆధారాలు కనిపిస్తుంటే, కొద్దో గొప్పో సిగ్గు పడతాడు. తన మాటలకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు, దేవుడంటే భయం, భక్తి ఉన్న వారెవరైనా పశ్చాత్తాప పడతారు. ప్రజలకు క్షమాపణ చెబుతారు. కానీ చంద్రబాబుకు పశ్చాత్తాపం ఉండదు. ఆయనకు దేవుడంటే భయం, భక్తి రెండూ లేవు అని అన్నారు.