ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. ఇరువురి మధ్య ఏం అంశాలపై చర్చ జరిగిందన్నది తెలియరాలేదు.కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.