పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్సులోని ఖైర్‌పూర్ సమీపంలో ఉన్న హైబత్ ఖాన్ బ్రోహి గ్రామానికి చెందిన ఓ యువతి అమీర్ బక్ష్ అనే యువకుడిని ప్రేమించింది.
అయితే వీరి ప్రేమకు యువతి కుటుంబం అంగీకరించలేదు. దీంతో ప్రియుడితో కలిసి ఆ యువతి తన 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం ఆధారంగా కేసు చేధించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa