బ్యాంకు ఉద్యోగి నుండి రూ.49 లక్షలు.. లాయర్ నుండి రూ.29 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకికి చెందిన ఎస్‌బీఐలో ఉద్యోగి టి.వెంకటేశ్వరరావు ఆన్‌లైన్ షేర్ల ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు చెప్తే నమ్మాడు.ట్రేడింగ్‌లో ఖాతా తెరచి వారు చెప్పిన వివిధ ఖాతాలకు రూ.49 లక్షలు పంపాడు.. తర్వాత ఆ ఖాతాలో రూ.2.82 కోట్లు వచ్చినట్లు కనిపించగా డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా వీలు పడలేదు. దీంతో మోసపోయానని గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు.అనకాపల్లి గాంధీనగరంలో నివాసం ఉంటున్న న్యాయవాది భవానీ ప్రసాద్‌కు ఈనెల 3న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, తాము ఈడీ నుంచి మాట్లాడుతున్నామని ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు మనీ లాండరింగ్ కేసు నమోదైందనంటూ బెదిరించారు.
అలాగే బాలికతో మసాజ్ చేయించుకున్న కేసు కూడా ఉందని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ చేయడానికి తాము అనకాపల్లి వస్తున్నట్లు నమ్మించారు.. అరెస్ట్ చేయకుండా ఉండడానికి నగదు ఇవ్వాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు.భయపడిన న్యాయవాది నేరగాళ్లకు రూ.29 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు.. ఇంకా 10 లక్షలు పంపాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేయగా, లాయర్ తన స్నేహితుడిని అడిగాడు.ఎప్పుడు అడగనిది కొత్తగా డబ్బులు అడిగాడని తన స్నేహితుడు ఆరా తీయగా, లాయర్, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడని తెలిసింది.. దీంతో పోలీసులకు సమచరమివ్వగా, ఇంకా డబ్బులు పోగొట్టుకోవద్దని లాయర్ ఖాతాలను బ్లాక్ చేశారు.