బాపట్ల పట్టణ ఏరియా వైద్యశాలలో గురువారం మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు జరిగింది. న్యాయవాది లీలా కృష్ణ ప్రసాద్, డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనై వివిధ ఆరోగ్య రుగ్మతలకు లోనవుతున్నారని దానిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు ఏకాగ్రతతో ప్రశాంతంగా ఉండాలని సూచించారు.