ఉపాధి హామీ పథకంలో ముదిగుబ్బ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పోస్టులు భర్తీ చేసి ఉపాధి పనులు కల్పించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఉపాధి కూలీలను ఆదుకోవాలని మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గురువారం మండల ఎంపీడీవో విజయ్ కుమార్ కు వినతిపత్రం అందించారు. అనంతరం కార్యాలయం ఎదుట అరగంట పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు.