ఆసియాన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ లావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (అక్టోబర్ 10) లావోస్‌లో లావో రామాయణంలోని ఒక భాగాన్ని వీక్షించారు.
"విజయ దశమికి కొన్ని రోజుల సమయం ఉంది, ఈ రోజు లావో పిడిఆర్లో, రావణుడిపై శ్రీరాముడి విజయాన్ని హైలైట్ చేస్తూ లావో రామాయణంలోని ఒక భాగాన్ని చూశాను. ఇక్కడి ప్రజలు రామాయణంతో సన్నిహితంగా ఉండటం మంచిగా ఉంది. ప్రభు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి!'' అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.