ఎస్సీ, ఎస్టీలంతా ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలని మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం నగరంలోని దళిత, ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల జెఎసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోండ్రు మాట్లాడుతూ గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ పథకాలను పునరుద్ధరిస్తామన్నారు.