ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూశారు. రతన్ టాటా మృతిపట్ల ప్రధాన మోడీ సహా ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా టాటా మృతిపట్ల సంతాపం తెలిపారు. అలాగే రతన్ టాటా మృతి నేపథ్యంలో ముంబై వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా పార్థివదేహానికి ఇరువురు నివాళులు అర్పించనున్నారు. ఈరోజు ఉదయం 11:45 గంటలకు వెలగపూడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గన్నవరం వెళ్లారు. 12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్లారు. మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకున్న సీఎం చంద్రబాబు, లోకేష్... 3 గంటలకు నారిమన్ పాయింట్‌లోని ఎన్‌సీపీఏ లాన్స్‌లో రతన్ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. తిరిగి 3:30 గంటలకు అమరావతికి సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.