మాజీ సీఎం జగన్ జిల్లాల పర్యటనకు వెళితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పర్మిషన్ ఇస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రెడ్‌బుక్‌లో పేరు ఉందంటూ వైసీపీ నాయకులు వణికిపోతున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పాదయాత్ర సమయంలో చెప్పినట్టుగానే భూకబ్జాలకు పాల్పడిన వారిపై, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని అన్నారు. అలాంటి వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని, ఫేక్ ప్రచారం చేసేవాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ ప్రచారం చేసేవారిపై చర్యల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరంలేదని అన్నారు.