విజయనగరం జిల్లాలో ప్రైవేట్ బస్సుల్లో నిషేధిత వస్తువులు, వాహనాలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ ఉప కమిషనర్ మణికుమార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంతో పాటు, నగర శివారుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికా రులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 19 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ బస్సుల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. బస్సుల్లో నిబంధనలు అతిక్రమించి ద్విచక్ర వాహనాలను రవాణా చేస్తున్నారని, పట్టుబడితే భారీ అపరాధ రుసుము తప్పదని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు వి.వెంకటరావు, పి.శివరాం గోపాల్, వి. శ్రావ్య, సిబ్బంది పాల్గొన్నారు.