విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవల స టోల్‌గేట్ సమీపం లోని చెరువు గట్టు వద్ద గంజాయి తాగుతున్నముగ్గురు యువ కులను డెంకాడ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి, మూడు మొబైల్స్‌ను సీజ్ చేసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నాతవలస టోల్‌గేట్ సమీపంలోని చెరువు గట్టు వద్ద శుక్రవారం కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నాట్టుగా డెంకాడ పోలీసులకు వచ్చిన సమాచారంతో డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు, సి బ్బందితో రైడ్ చేసి, చెరువుగట్టు మీద అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టారన్నారు.
నిందితులను విశాఖపట్నం సిటీకి చెందిన గంటా చిరంజీవి, గోరిజిలి డానియల్ రాజ్, చిన్ని సమంత్‌లుగా గుర్తించి వారిని అదు పులోనికి తీసుకున్నారు. వీరికి గంజాయిని సరఫరా చేసిన వారి గురించి సమాచారం రాబట్టామని, అతడిని కూడా త్వరలో అరెస్ట్టు చేస్తామన్నారు. భోగాపురం సర్కిల్ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ, డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.