కోల్‌కతా హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ జూడాలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అపూర్వ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే 200మందికి పైగా సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయగా..తాజాగా మరో 77మంది వైద్యులు అందుకు సిద్ధమయ్యారు.
ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్‌కు పంపిన ఈ-మెయిల్లో తమ నిర్ణయాన్ని వెల్లడించారు.అక్టోబర్ 14లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే తమ విధులను నిలిపివేస్తామని హెచ్చరించారు.