ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్పై మావోయిస్ట్ పార్టీ స్పందించింది. భద్రతా బలగాలు జరిపిన దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. వారి పేర్లతో కూడిన లిస్టును విడుదల చేసింది.
ఎన్కౌంటర్లో మొదట 14 మంది మరణించారని.. కాల్పుల్లో గాయపడిన 17మందిని పట్టుకుని కాల్చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. బస్తర్ మాజీ డివిజనల్ కమిటీ మృతి చెందిన మావోయిస్టులకి నివాళులర్పించినట్లు పేర్కొంది.