ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. మద్యంపై రెండు శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. డ్రగ్ రిహాబిలిటేషన్ సెస్ కింద దీన్ని వసూలు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. సోమవారం మద్యం షాపులను లాటరీ ద్వారా కేటాయించగా, బుధవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.