ఉత్తరాంధ్ర కల్పవల్లి కోర్కెలు తీర్చే ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ పూజారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అమ్మవారు శక్తినివ్వాలని కోరినట్లు తెలిపారు.