స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా వీవోఏలు కృషి చేయాలని రాజానగరం డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్‌వీవీఎస్ మూర్తి ఆకాంక్షించారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (సిడ్బీ) ఆధ్వర్యంలో మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా చిన్న పరిశ్రమల ఏర్పాటులో తీసుకోవాల్సిన జా గ్రత్తలు, మెళకువలపై మండలంలోని వీవోఏలకు స్థానిక సెర్ప్ కార్యాలయంలో బుధవారం నిర్వ హించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. గ్రామీణ మహిళలు స్వయం ఉపా ధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులంతా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకుంటూ పొదుపు సంఘాల నుంచి అంతర్గత అప్పులు అందించేలా కృషి చేయాలన్నారు. సిడ్బీ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు ఆర్థి క పురోభివృద్ధి సాధించేందుకు బ్యాంకుల నుంచి సబ్సితో కూడిన రుణాలు మంజూరు చేస్తోందని, వాటిని అందిపుచ్చుకుని పరిశ్రమలు స్థాపించు కుని స్వయం సమృద్ధి సాధించాలన్నారు. తీసు కున్న రుణాలను సకాలంలో చెల్లించేలా చూడా ల్సిన బాధ్యత వీవోఏలుపై ఉందన్నారు. కార్యక్ర మంలో పరిశ్రమశాఖ ఐపీవో సత్యనారాయణ, ఫుడ్ ప్రోసెసింగ్ సీనియర్ ఎకౌంటెంట్ మాధవి, డీఆర్‌పీఎం హేమంత్, డీఆర్‌పీ సుకాంతి, సెర్ప్ ఏపీఎం గుమ్మడి సునీత, దివాన్‌చెరువు, రాజాన గరంలోని వివిధ బ్యాంకుల చెందిన మేనేజర్లు, సెర్ప్ సీసీలు తదితరులు పాల్గొన్నారు.