మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కర్నూలు జిల్లాలోని కులుమాల గ్రామంలో కృష్ణవేణి (27)ని హత్య చేసిన భర్త పక్కీరప్పను అరెస్టు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. ఈనెల 13న మద్యం తాగడానికి పక్కీరప్ప భార్య కృష్ణవేణిని డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో పక్కీరప్ప కృష్ణవేణి తలపై రాతి కొట్టి హత్య చేశాడు.
కృష్ణవేణి తండ్రి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బుధవారం సాయంత్రం కులుమాల, చిన్నమరివీడు గ్రామాల మధ్య నల్లపోచమ్మ గుడి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతు న్న వ్యక్తిని విచారించగా పక్కీరప్ప అని తెలియడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.