శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.261 కోట్లు ఉపాధి హామీ పథకంలో మంజూర య్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్లి గ్రామం నుంచి గోవర్థనపురం వరకు, బెజ్జి నుంచి ముంజువానిపేట గ్రామం వరకు రోడ్ల నిర్మాణా నికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె పండుగ కార్యక్రమంలో ఈ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు స్థానికులు సహకరించాలన్నారు.
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. బొంతు ఎత్తిపోతల పథకం పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ చిన్నాల కూర్మినాయుడు, టీడీపీ నేతలు ధర్మాన తేజకుమార్, కత్తిరి వెంకటరమణ, సురవరపు తిరుపతిరావు, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఎంపీడీవో మోహన్‌కుమార్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంఈవో ఎం.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.