నిడదవోలు పరిధిలోని ఉండ్రాజవరం మండలం తాడి పర్రు గ్రామంలో సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహం ముసుగు తొలగింపుతో రెండు సామా జిక వర్గాల మధ్య గురువారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వివరా ల్లోకి వెళితే తాడిపర్రులో సుమారు రెండేళ్ల క్రితం గౌడ సామాజిక వర్గీయు లు గ్రామంలోని అజ్జరం రోడ్డులో సర్ధార్ పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణకు ఏర్పా ట్లు చేసుకున్నారు. అయితే అప్పుడు ఈ విగ్రహం ఏర్పాటును కాపు సామాజిక వర్గం వ్యతిరేకించ డంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అప్పటి నుంచి గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ నేపఽథ్యంలో విజయదశమి ఉత్సవాల ముగింపు సంద ర్భంగా గ్రామంలో అమ్మవారి ఊరేగింపులో చెలరేగిన ఘ ర్షణలో కోపోద్రిక్తులైన గౌడ వర్గానికి చెందిన మహిళలు బుధ వారం పాపన్న గౌడ్ విగ్రహానికి ఉన్న ముసు గును తొలగించినట్టు సమా చారం.
అర్ధరాత్రి జరిగిన ఈ సంఘ టనతో అధికారులు అప్రమ త్తమై 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువ ర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో గ్రామంలో పీస్ కమిటీని ఏర్పాటు చేశారు. విగ్రహం వద్ద పెట్రోలు సీసాలు చేతపట్టి మహి ళలు చేస్తున్న నిరసనను ఆర్డీవో రాణి సుస్మిత శాంతింపజేశారు. ఇరు వర్గాలతో దఫదఫాలుగా చర్చలు జరిపారు. 144 సెక్షన్ అమలులో ఉం డగా విగ్రహం ముసుగును తొలగించడం నేర మని చెప్పారు. సుదీర్ఘ మంతనాల అనంతరం పాపన్నగౌడ్ విగ్రహం చుట్టూ గుడ్డను కట్టి సమస్యను పరిష్కరించారు. సుమారు 18 నెల లుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఎట్టకేలకు గురువారం రాత్రికి సమస్యను అధికార్టు ఒక కొలిక్కి తీసుకువచ్చారు. ఎంపీడీవో వివివి రామారావు, ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు.