గుంటూరు జాతీయ ఆరోగ్య మిషన్లో ఉద్యోగ నియామకాల భర్తీకై దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా డిఎంహెచ్ వో డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం గుంటూరులో ఆమె మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులు www. guntur. ap. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను డిడితో జతచేసి ఈ నెల 30వ తేదీలోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.